Lizard | మ‌హిళ‌ల‌కు బ‌ల్లి అక్క‌డ ప‌డితే.. మ‌గ శిశువు జ‌న్మిస్తాడ‌ట‌..!

Lizard | చాలా మంది గృహిణుల‌కు బ‌ల్లులు అంటేనే భ‌య‌ప‌డిపోతారు. అవి క‌నిపిస్తే చాలు.. తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతారు. కానీ బ‌ల్లులు అదృష్టాన్ని తీసుకువ‌స్తాయ‌ట‌. మ‌హిళ శ‌రీరంపై ఈ భాగాల్లో బ‌ల్లి ప‌డితే మంచిద‌ని, శుభ‌వార్త‌లు వింటార‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

  • By: raj |    devotional |    Published on : May 12, 2026 6:47 AM IST
Lizard | మ‌హిళ‌ల‌కు బ‌ల్లి అక్క‌డ ప‌డితే.. మ‌గ శిశువు జ‌న్మిస్తాడ‌ట‌..!

Lizard | జ్యోతిష్య శాస్త్రంలో బ‌ల్లి శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంద‌ని పండితులు చెబుతున్నారు. అయితే కొంద‌రు బ‌ల్లి ప‌డితే అపశ‌కునంగా భావిస్తారు. కానీ అలా భావించాల్సిన అవ‌స‌రం లేద‌ని సూచిస్తున్నారు. మ‌హిళ శ‌రీరంలోని ఈ భాగాల‌పై బ‌ల్లి ప‌డితే.. భ‌ర్త నుంచి శుభవార్త విన‌డం, మ‌గ పిల్ల‌లు పుట్ట‌డం, ఆర్థికంగా ఎద‌గ‌డం వంటివి క‌లుగుతాయ‌ని పండితులు పేర్కొంటున్నారు. అయితే బ‌ల్లి శాస్త్రం ప్ర‌కారం.. ఆడవారికి ఏ ప్ర‌దేశంలో బ‌ల్లి ప‌డితే మంచిదో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

ఎడ‌మ క‌న్నుపై

పెళ్లైన మ‌హిళ‌ల‌కు ఎడ‌మ క‌న్నుపై బ‌ల్లి ప‌డితే ఎంతో మంచిద‌ని పండితులు అంటున్నారు. భ‌ర్త నుంచి శుభ‌వార్త వింటార‌ట‌. లేదా స‌న్నిహితులు ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్తార‌ట‌. భ‌ర్త‌తో బంధం బ‌ల‌ప‌డుతుంద‌ట‌.

ఎడ‌మ చెవిపై

మ‌హిళ‌ల‌కు ఎడ‌మ చెవిపై బ‌ల్లి ప‌డితే చాలా శుభ‌ప్ర‌ద‌మ‌ట‌. సంప‌ద‌ను, లాభాల‌ను తీసుకువ‌స్తుంద‌ట‌. అప్పుల‌న్నీ తీరిపోయి ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌లిగి.. ధ‌నానికి, ధ‌న్యానికి లోటు ఉండ‌ద‌ట‌. కోటీశ్వ‌రులైపోతార‌ట‌.

ఎడ‌మ పాదంపై

ఎడ‌మ పాదంపై బ‌ల్లి ప‌డితే ప్రయాణాలు లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేస్తార‌ట‌. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవ‌కాశం ఉంటుంద‌ట‌.

కుడి చెంప‌పై

పెళ్లైన మ‌హిళ‌ల‌కు కుడి చెంపై బ‌ల్లి ప‌డితే.. త‌ప్ప‌కుండా మ‌గ‌శిశువులు జ‌న్మిస్తార‌ట‌. అంతేకాకుంతా అత్తారింటి నుంచి అదృష్టం క‌లిసి వ‌స్తుంద‌ట‌. భ‌ర్త‌తో అన్యోన్యంగా ఉంటార‌ట‌.