Mole | అమ్మాయిలకు అక్కడ పుట్టుమచ్చ ఉంటే.. పెళ్లి తర్వాత కోటీశ్వరులై పోతారట..!
Mole | పుట్టుమచ్చలు అంటే కేవలం గుర్తులే కాదు.. ఆ పుట్టుమచ్చలు స్త్రీకి ఎంతో సౌందర్యాన్ని ఇస్తాయి. అంతేకాదు.. స్త్రీ శరీరంపై పుట్టుమచ్చలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అక్కడ కనుక అమ్మాయిలకు పుట్టుమచ్చ ఉంటే పెళ్లాయ్యక కోటీశ్వరులైపోతారట.
Mole | అమ్మాయిలకు, మహిళలకు పుట్టుమచ్చలు అందాన్ని తీసుకొస్తాయి. ఈ పుట్టుమచ్చలు శుభ, అశుభ ఫలితాలను కూడా ఇస్తాయి. ఇక స్త్రీ శరీర భాగాలపై ఉండే పుట్టుమచ్చలకు ప్రత్యేకత కూడా ఉంది. ఒక్కో భాగంలో ఉండే పుట్టుమచ్చకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కూడా. అయితే అమ్మాయిలకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు సంభవిస్తాయో ఈ కథనంలో చూద్దాం.
ఎడమ చెంపపై
ఏ అమ్మాయికి అయితే ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉంటుందో.. వారు చాలా అదృష్టవంతులట. ధన ప్రవాహం స్థాయికి మించి ఉంటుందట. చలాకీగా ఉంటూ.. అందరితో స్నేహంగా మెలుగుతారట. గొప్ప స్థాయిలో ఉంటారట.
రెండు కనుబొమ్మల మధ్య
చాలా మంది అమ్మాయిలకు రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చలు ఉంటాయి. ఇలాంటి వారికి అదృష్టం తలపు తట్టనుంది. అంతేకాదు రాజయోగం కలిగి.. కోరుకున్న ప్రతి పని నెరవేరుతుందట. రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉన్న అమ్మాయికి పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చి కోటీశ్వరులై పోతారట.
నుదిటిపై కుడి వైపు
నుదిటిపై కుడి వైపు పుట్టుమచ్చ ఉండటం కూడా చాలా శుభప్రదం. ఇలాంటి స్త్రీలు చాలా అదృష్టవంతులు. వీరి చేతిలో ఎప్పుడూ డబ్బే ఉంటుంది. అంతే కాకుండా వీరికి డబ్బు కొరత ఉండదు. చాలా సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని గడుపుతారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram