ప్రభాస్ – అనుష్కల వివాహం : పెద్దమ్మ శ్యామలాదేవి ఏర్పాట్లలో నిమగ్నం..?
ప్రభాస్ – అనుష్కల వివాహం...జాతక సంబంధిత సమస్యలే కారణం..ఇందువల్లే పెళ్లికి అప్పట్లో కృష్ణంరాజు ససేమిరా..దోష పరిహార పూజల కోసం ఆలయాలను సందర్శిస్తున్న శ్యామలాదేవి. పెద్దమ్మ శ్యామలాదేవి ఏర్పాట్లలో నిమగ్నం..?

- జాతక సంబంధిత సమస్యలే కారణం
- ఇందువల్లే పెళ్లికి అప్పట్లో కృష్ణంరాజు ససేమిరా!
- దోష పరిహార పూజల కోసం ఆలయాలను సందర్శిస్తున్న శ్యామలాదేవి.
తెలుగు చిత్రసీమలో సీనియర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరొందిన రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయన పెళ్లిపై మళ్లీ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అనుష్కతో వివాహం విషయాన్ని అందుకుని మళ్లీ కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి.
ప్రభాస్(Prabhas) – అనుష్క(Anushka)… చూడచక్కని జంట. ఎన్నో చిత్రాల్లో కనువిందు చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ చాలా దగ్గరయ్యారని వేలాదిగా వార్తలున్నాయి. వాటిలో చాలా నమ్మదగినవి కూడా ఉండటం వాస్తవం. కారణం అనుష్క కూడా పెళ్లి చేసుకోకపోవడమే. ఇప్పుడు ప్రభాస్‌కు 45 ఏళ్లు. అనుష్కకు 43 ఏళ్లు. సరే.. ప్రభాస్ సంగతి వదిలేసినా, అడపిల్లగా అనుష్కకు 43 ఏళ్లు వచ్చేవరకు వివాహం చేయకపోవడమనేది విడ్డూరమే. కారణం, ఈ జంట దంపతులు కావాలనుకోవడమేననేది సినీవర్గాల భోగట్టా. కొంతమంది ఇంకో అడుగు ముందుకేసి, వాళ్లిద్దరూ ప్రభాస్ ఫాంహౌస్‌లో సహజీవనం(Live-in Relation) చేస్తున్నారని కూడా అంటున్నారు.
ఉప్పులపాటి కుటుంబానికి దగ్గరివారు తెలిపిన విశ్వసనీయ సమాచారమేంటంటే, ప్రభాస్ పెదనాన్న, రెబల్‌స్టార్ కృష్ణంరాజుకు ఆచారాలు, సంప్రదాయాల పట్ల విపరీతమైన నమ్మకం. ఆ నమ్మకమే ఈ జంటకు కష్టాలు తెచ్చిపెట్టిందనేది ఇప్పుడు తలెత్తిన తాజా వార్త. ప్రభాస్, అనుష్కలు ప్రేమించుకున్న మాట నిజం. పెళ్లి చేసుకోవాలనుకున్నది కూడా నిజమే. ఇదే విషయాన్ని పెద్దమ్మ శ్యామల ద్వారా పెద్దాయన చెవిలో వేయగా, ఆయన కూడా ఇష్టపడ్డారట. అయితే అక్కడే వచ్చిపడింది అసలు సమస్య. అనుష్క జాతకచక్రం తెప్పించిన కృష్ణంరాజు, ఇద్దరి జాతకాలను పండితులకు చూపించగా, అవి కలవడం లేదని వారు చెప్పినట్లుగా, దాంతో రాజు గారు వివాహానికి ససేమిరా అన్నట్లు వారి ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్స్ కథనం.
ఇక కృష్ణంరాజు గారు గతించి కొన్నేళ్లైన తర్వాత, ఇప్పుడు పెద్దమ్మ శ్యామల ఆ బాధ్యతను భుజానికెత్తుకుంది. విషయం మొత్తం ముందే తెలిసినావిడ కాబట్టి, ఈ కలవని జాతకాలకు దోషపరిహారాలను వెతకడం మొదలుపెట్టినట్లు తెలిసింది. దీనికి ఒక మహా పండితుడిని సంప్రదించి, దోష పరిహారానికై పూజలు, వ్రతాలు, హోమాలు, యాగాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలోనే శ్యామలమ్మ శాక్తేయ ఆలయాలలో పూజలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, వరంగల్ భద్రకాళి, జోగుళాంబ ఆలయాల్లో పరిహార పూజలు చేస్తున్నారట. ఇంకా దీనికి సంబంధించిన యజ్ఞయాగాదులు, హోమాలు కూడా సక్రమంగా జరిపించేందుకు హేమాహేమీలైన పండితులను రప్పిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
ఏదేమైనా, అభిమానుల దృష్టిలో అన్నావదినలైన ప్రభాస్, అనుష్కల పెళ్లి జరిగితే అది నిత్యం వార్తల్లో ఉండే గాసిప్‌కు ముగింపు మాత్రమే కాదు, తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక మంచి శుభవార్త అవుతుంది!
త