విధాత : తెలంగాణ ప్రభుత్వం 11మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న అరవింద్‌కుమార్‌ను రెవెన్యూ శాఖ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేసింది. బీసీ వెల్ఫేర్ కార్యదర్శిగా ఉన్న బీ వెంకటేశంను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది. రవాణా శాఖ కార్యదర్శి వాణీ ప్రసాద్‌ను అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరక్టర్ దాన కిశోర్‌ను మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ఆర్‌ఆండ్‌బీ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజును రవాణా శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. సీఎం కార్యదర్శిగా ఉన్న రాహుల్ బొజ్జాను జీఏడీ కార్యదర్శిగా బదిలీ చేసింది. కమర్షియల్ టాక్స్ కమిషనర్‌గా ఉన్న డాక్టర్ క్రిస్టియాన జడ్ చొంగ్తూను హెచ్‌ఎం, ఎఫ్‌డబ్ల్యు శాఖ కార్యదర్శిగా నియమించింది.
మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ కార్యదర్శిగా ఉన్న సీ సుదర్శన రెడ్డిని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీగా బదిలీ చేశారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నటీకే శ్రీదేవిని కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌గా బదిలీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను నియమించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆర్వీ కర్ణన్‌ను వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేసింది.