రాజకీయానికి వైద్యం చేసేందుకు అసెంబ్లీకి వైద్యులు వచ్చారు

తెలంగాణ శాసనసభకు ఏకంగా 12 మంది డాక్టర్లు ఎన్నికయ్యారు.

  • Publish Date - December 3, 2023 / 06:11 PM IST

విధాత, వరంగల్: తెలంగాణ శాసనసభకు ఏకంగా 12 మంది డాక్టర్లు ఎన్నికయ్యారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్, బీఆరెస్ పార్టీల తరపున ఎన్నికల క్షేత్రంలో తలపడిన వైద్యులు… ప్రజానాడిని పట్టి విజయాన్ని కైవసం చేసుకున్నారు.


కొత్తగా కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికశాతం మంది డాక్టర్లు అత్యున్నత చట్టసభలో కాలుమోపనున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై 10 మంది, బీఆరెస్ గుర్తుపై ఇద్దరు డాక్టర్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. గెలుపొందిన డాక్టర్లు వీరే..

1. డాక్టర్ రామచందర్ నాయక్

ఎం.ఎస్. జనరల్ సర్జన్, 

ఎమ్మెల్యే, డోర్నకల్ – కాంగ్రెస్

2. డాక్టర్ వంశీక్రిష్ణ

ఎం.ఎస్. జనరల్ సర్జన్, 

ఎమ్మెల్యే, అచ్చంపేట – కాంగ్రెస్

3. డాక్టర్ పాల్వాయి హరీష్

ఎం.ఎస్. ఆర్థో,

 ఎమ్మెల్యే, సిర్పూర్ – బీజేపీ

4. డాక్టర్ మురళీ నాయక్

ఎం.ఎస్. జనరల్ సర్జన్, 

ఎమ్మెల్యే, మహబూబాబాద్ – కాంగ్రెస్

5. డాక్టర్ సత్యనారాయణ

ఎం.ఎస్. జనరల్ సర్జన్, 

ఎమ్మెల్యే, మానకొండూరు – కాంగ్రెస్

6. డాక్టర్ మైనంపల్లి రోహిత్

ఎంబీబీఎస్, 

ఎమ్మెల్యే, మెదక్ – కాంగ్రెస్

7. డాక్టర్ పర్ణికా రెడ్డి

రేడియాలజిస్ట్,

ఎమ్మెల్యే, నారాయణ పేట – కాంగ్రెస్

8. డాక్టర్ సంజీవరెడ్డి

పెడియాట్రిషియన్,

ఎమ్మెల్యే, నారాయణ్ ఖేడ్- కాంగ్రెస్

9. డాక్టర్ ముత్తా రాగమయి

పల్మనాలజిస్ట్,

ఎమ్మెల్యే, సత్తుపల్లి – కాంగ్రెస్

10. డాక్టర్ తెల్లం వెంకట్రావ్

ఆర్థో, 

ఎమ్మెల్యే, భద్రాచలం – బీఆరెస్

11. డాక్టర్ సంజయ్,

ఆర్థో, 

ఎమ్మెల్యే, కోరుట్ల – బీఆరెస్

12. డాక్టర్ భూపతిరెడ్డి

ఆర్థో, 

ఎమ్మెల్యే, నిజామాబాద్ – కాంగ్రెస్