Site icon vidhaatha

తెలంగాణలో కొత్తగా 230 కరోనా కేసులు

విధాత,హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 50,636 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 230 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,59,543కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,884కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 357 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,545యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.57 శాతానికి చేరిందని అధికారులు తెలిపారు.

Exit mobile version