Site icon vidhaatha

Corona Cases: భారత్ లో నాలుగు వేలు దాటిన కరోనా కేసులు!

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా కేసులు 4 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా 4,026 కరోనా యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు మృతి చెందారు. గత 24గంటల్లో కొత్తగా 65కేసులు నమోదయ్యాయి. 2,700మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా కేరళలో 1,416 కేసులు, మహారాష్ట్రలో 494కేసులు, గుజరాత్ లో 397కేసులు, ఢిల్లీలో 393, పశ్చిమ బెంగాల్ లో 372, కర్ణాటకలో 311 కేసులు నమోదయ్యాయి. ఏపీలో 28, తెలంగాణలో 4 యాక్టివ్‌ కేసులు నమోదయ్యయి. కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలను పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించింది.

Exit mobile version