విధాత: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో సవరించిన ఓటర్ల జాబితా మేరకు 26 లక్షల 87,818 మంది ఓటర్ల తో ఎన్నికల యంత్రాంగం తుది జాబితాను ప్రకటించింది.
దేవరకొండ నియోజకవర్గం లో 2,27,760 మంది ఓటర్లు ఉండగా, వారిలో కొత్తగా 3184 మంది ఓటర్లు నమోదయ్యారు. నాగార్జునసాగర్ లో 2,17,653 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా 3687మంది ఓటర్లు నమోదయ్యారు. మిర్యాలగూడలో 2,11,898 ఓటర్లు ఉండగా, కొత్తగా 5942 మంది ఓటర్లు నమోదయ్యారు.
నల్గొండలో 2,24,458 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా 5622మంది ఓటర్లు నమోదయ్యారు. మునుగోడులో 2,40,093 ఓటర్లు ఉండగా వారిలో కొత్తగా 4349 ఓటర్లు నమోదయ్యారు, నకిరేకల్ లో 2,33,620 ఓటర్లు ఉండగా, కొత్తగా 5502 ఓటర్లు నమోదయ్యారు, హుజూర్నగర్ లో 2,30,359 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా 4465 మంది ఓటర్లు నమోదయ్యారు. కోదాడలో 2,25,714 మంది ఓటర్లు ఉండగా , కొత్తగా 3483 ఓటర్లు నమోదు అయ్యారు.
సూర్యాపేటలో 2, 22,769 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా 4368 ఓటర్లు నమోదయ్యారు, తుంగతుర్తిలో 2,35,349 మంది ఓటర్లు ఉండగా , కొత్తగా 4562 ఓటర్లు నమోదయ్యారు , భువనగిరిలో 2, 01,681 మందిఓటర్లు ఉండగా , కొత్తగా 5280 ఓటర్లు నమోదు అయ్యారు. ఆలేరులో 2,16,464 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా 5050 మంది ఓటర్లు నమోదు అయ్యారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాల పరిధిలో కొత్తగా 55,494 మంది ఓటర్లు నమోదు కాగా 54,373 మంది దరఖాస్తులు తిరస్కరణకు గురికావడం గమనార్హం. అత్యధికంగా మునుగోడు నియోజకవర్గంలో 2,40,093మంది ఓటర్లు ఉండగా, అతి తక్కువ గా భువనగిరి నియోజకవర్గంలో 2,016,81మంది ఓటర్లు ఉన్నారు.