విధాత, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో 60శాతం కేసిఆర్ కుటుంబ సభ్యుల చేతుల్లో ఉందని టీపీసీసీ ఇంచార్జీ మానిక్ రావు థాక్రే ఆరోపించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగు పడిందన్నారు. తెలంగాణ కోసం 1200 మంది యువకులు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. తెలంగాణ లోని ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదన్నారు. పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసిసీఆర్ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ నిర్మాణం కోసం సోనియా గాంధీ మాట ఇచ్చారన్నారు.
నేటి నుంచి నిరుద్యోగ యువత ప్రచారం
తెలంగాణ విఠల్
తెలంగాణ ఏ ఒక్కరి వల్ల రాలేదని తెలంగాణ విఠల్ అన్నారు. త్యాగాలు ప్రజలవి భోగాలు కేసీఆర్ కుటుంబానివన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి కృతజ్ఞత తెలుపల్సిన అవసరం ఉందని పౌర సమాజం తరుపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రేపటి నుంచి నిరుద్యోగ యువత ప్రచారం చేయబోతుందన్నారు. దంచుడే దించుడే నినాదంతో పౌర సమాజం ముందుకు వెళ్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తప్పులు చేస్తే ప్రశ్నిస్తామన్నారు. బేషేరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామన్నారు. బీఆరెస్ పార్టీ ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకుందన్నారు. పార్టీ పేరు లో తెలంగాణ తీసేసిన వాళ్లకు మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ఉద్యమ ద్రోహులు,ఉద్యమ కారులు ఎవరనేది తెలుసుకోవాలన్నారు. కేసీఆర్‌కు పదేళ్ల పాలనలో అమరుల అడ్రస్ దొరకలేదా? ఎందుకు పరిహారం ఇవ్వలేదని అడిగారు. కానీ పంజాబ్ రైతు లు చనిపోతే పరిహారం చెల్లించావన్నారు.
నటించడంలో మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఇద్దరే- మాజీ మంత్రి పుష్ప లీల
మోదీ సభ లో జరిగిన ఘటన స్టంట్ లాగా ఉందని మాజీ మంత్రి పుష్పలీల అన్నారు.భేటీ పడావో భేటీ బచావో.. అంటూ నటనా చక్రవర్తి మోదీ నటించారన్నారు. నటించటం లో మోదీ కేసీఆర్ ఇద్దరూ ఇద్దరేనని అన్నారు. 9 ఏళ్ళలో ఏనాడు మాదిగలను పట్టించుకోని మోదీ ఇప్పుడు ప్రేమ ఒలక పోశాడన్నారు. మాదిగ సమాజం కృష్ణ మాదిగ ని చూసి ఆశ్చర్య పోతుందన్నారు. నేను ఉద్యమం లో కుటుంబం వదిలి అరెస్ట్ అయ్యాను నాపేరు ఎప్పుడు కృష్ణ మాదిగ ప్రస్తావించకుండా అవకాశ వాద రాజకీయాలు చేస్తున్నాడన్నారు. దళితుల ప్రక్షాన ఉన్నది పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. దళితులను ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్ పార్టీ కి మాత్రమే ఉందన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవిత ని వదిలి సోనియా గాంధీ మీద ఈడీకేస్ లు పెడుతుంటే నే బీజేపీ, బీఆరెస్ దోస్తీ అర్ధం అవుతోందన్నారు. సుప్రీమ్ కోర్ట్ లో ఉన్న కేసును అధికారం చేతులో పెట్టుకొని ఇక్కడి కి వచ్చి మాట్లాడిన అంత మంత్రానికి ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.