Site icon vidhaatha

TELANGANA | మంగళవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ రుణమాఫీ, ధరణిపై ప్రధాన చర్చ … మొత్తం 9 అంశాలపై సమీక్ష

నేడు కలెక్టర్ల కాన్ఫరెన్స్
రుణమాఫీ, ధరణిపై ప్రధాన చర్చ
మొత్తం 9 అంశాలపై సమీక్ష
విధాత: రుణమాఫీ అమలు తో పాటు ధరణి సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులంతా ఉదయం 9.30 గంటల వరకు సచివాలయానికి రావాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీని ఆగస్ట్ 15వ తేదీలోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు కలెక్టర్లకు ఏవిధంగా రుణమాఫీ కార్యక్రమాన్ని స్పీడప్ చేయాలన్న దానిపై గైడెన్స్ ఇవ్వనున్నారు. అలాగే ధరణి సమస్యలు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. రోజు రోజుకు సమస్యలు పెరుగుతున్నాయి కానీ తరగడం లేదు. కొన్ని సమస్యలు ధరణి చట్టం మరితేనే సాధ్యం అయ్యే పరిస్థికి కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో కలెక్టర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మొత్తం 9 అంశాలపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.

 

Exit mobile version