విధాత, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి కోకాపేటలో వీధి కుక్క రెచ్చిపోయింది. దివ్యాంగుడైన బాలుడిపై వీధి కుక్క దాడి చేసి పురుషాంగాన్ని కొరికి వేసింది. ఈ సంఘటన కోకాపేట సబితా నగర్ లో జరిగింది. కూలి పని చేసుకునే అంజమ్మ కుమారుడు ఏడేళ్ల భరత్ దివ్యాంగుడు కావడంతో ఇంటి వద్ద గుడిసెలో ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు పనికి వెళ్తూ బాలుడు మలమూత్ర విసర్జనకు వెళ్లేందుకు వీలుగా నిక్కర్ వెయ్యలేదు. గుడిసె బయట టాయిలెట్ కు వెళ్లి వచ్చి గుడిసెలో పడుకుంటుండగా బయట నుంచి వచ్చిన వీధి కుక్క బాలుడి పురుషాంగాన్ని కొరికి వేసింది. దీంతో బాలుడు గట్టిగా కేకేలు పెట్టడటంతో చుట్టుపక్కల వారు వచ్చి కుక్కను తరిమేశారు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన స్థానికులు బాలుడిని నార్సింగిలోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలుడికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తల్లిదండ్రులకు చెప్పడంతో తమకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
బాలుడి మర్మంగాన్ని కొరికేసిన వీధి కుక్క.. కోకాపేట సబితానగర్‌లో దారుణం
