మద్యం మత్తులో ఛాలెంజ్.. నదిలో దూకి యువకుడి దుర్మరణం

మద్యం మత్తులో స్నేహితులతో ఛాలెంజ్ చేసి నదిలో దూకి ఈత రాక ఓ యువకుడు దుర్మరణం చెందాడు. హైదరాబాద్ చంద్రాయణ గుట్ట బండ్లగూడ ప్రాంతానికి చెందిన

  • Publish Date - May 23, 2024 / 12:15 PM IST

కాపాడటం మాని వీడియో తీసిన స్నేహితులు

విధాత: మద్యం మత్తులో స్నేహితులతో ఛాలెంజ్ చేసి నదిలో దూకి ఈత రాక ఓ యువకుడు దుర్మరణం చెందాడు. హైదరాబాద్ చంద్రాయణ గుట్ట బండ్లగూడ ప్రాంతానికి చెందిన నలుగురు మిత్రులు కర్ణాటక రాష్ట్రంలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతానికి వెళ్లారు. ఫుల్లుగా మద్యం తాగిన మైకంలో మిత్రులు రెచ్చగొట్టడంతో సాజిద్‌ అనే యువకుడు ఛాలెంజ్‌గా తీసుకుని మద్యం మత్తులో నదిలో దూకి ఈతరాక నీట మునిగి చనిపోయాడు.

ఎందుకోగాని ఇద్దరు మాత్రం నదిలో దూకి సాజిత్‌ దగ్గరి వరకు వెళ్లినప్పటికి అతడిని రక్షించే ప్రయత్నం చేయలేదు. సాజిద్‌ నీటిలో గల్లంతయ్యే వరకు వీడియో తీస్తూ ఉండిపోవడం వివాస్పదంగా మారింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Latest News