కంటి వెలుగు నిర్వహణకు ప్రణాళిక: GWMC కమిషనర్ ప్రావీణ్య

విధాత, వరంగల్: కంటి వెలుగు నిర్వహణకు పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయం లో అధికారులతో సమావేశమై కంటి వెలుగు కేంద్రాల గుర్తింపు, పటిష్ట ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కంటి వెలుగు ఈ నెల 18 వ తేదీ నుండి 100 రోజుల పని దినాలు నిర్వహించనున్న నేపధ్యంలో బల్దియా అధికారులు సమన్వయంతో విజయవంతం చేయలన్నారు. GWMC పరిధిలోని 66 డివిజన్లో […]

  • Publish Date - January 7, 2023 / 04:01 PM IST

విధాత, వరంగల్: కంటి వెలుగు నిర్వహణకు పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయం లో అధికారులతో సమావేశమై కంటి వెలుగు కేంద్రాల గుర్తింపు, పటిష్ట ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కంటి వెలుగు ఈ నెల 18 వ తేదీ నుండి 100 రోజుల పని దినాలు నిర్వహించనున్న నేపధ్యంలో బల్దియా అధికారులు సమన్వయంతో విజయవంతం చేయలన్నారు. GWMC పరిధిలోని 66 డివిజన్లో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా వెంటనే కంటి వెలుగు కేంద్రాలను గుర్తించాలని అన్నారు.

జిడబ్ల్యూ ఎంసీ నోడల్ అధికారి బల్దియా అదనపు కమిషనర్ రవీందర్ యాదవ్ వరంగల్, హన్మకొండ డిఎంహెచ్ ఓ లతో సమన్వయం చేసుకొని జిడబ్ల్యూ ఎంసీ పరిధిలో జరిగే మొత్తం శిబిరాలు ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా సమర్ధంగా నిర్వ‌హించేలా చూడాలని అన్నారు.

ప్రతి కంటి వెలుగు కేంద్రానికి నోడల్ అధికారులుగా నియమితులైన ఏఈ, సానిటరీ ఇన్స్పెక్టర్లు ఆయా కేంద్రాల వద్ద ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మౌలిక సదుపాయాలు, షామియానాలు, మంచినీటి సరఫరా, టాయిలెట్స్, లైటింగ్ ఫర్నిచర్ ఇంజనీరింగ్, సానిటేషన్ సంబంధిత ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కంటి వెలుగు శిబిరం నిర్వహించే వేదిక వివరాల ప్రచార సామగ్రి సిద్ధం చేసుకొని ముందుగానే ఆయా డివిజన్లో జరిగే కంటి వెలుగు శిబిరం వివరాలు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ముఖ్యంగా మెప్మా సిబ్బంది, మహిళ గ్రూప్ సభ్యులచే చేయాలన్నారు. సమీక్షలో అదనపు కమిషనర్ రవీందర్ యాదవ్, ఎస్ ఈ కృష్ణ రావు, సీఎం హెచ్ ఓ జ్ఞానేశ్వర్, సెక్రెటరీ విజయలక్ష్మి, ఎంహెచ్ ఓ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.