చైర్మన్ పదవికి తిప్పన రాజీనామా

తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు

  • Publish Date - December 7, 2023 / 03:36 PM IST

విధాత: తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. మరో ఏడాది పదవీకాలం ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు కార్పొరేషన్ ఎండీ ద్వారా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.