G. Kishan Reddy | సుంకిశాల ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి : కేంద్ర మంతి జి.కిషన్‌రెడ్డి

సుంకిశాల తాగునీటి టన్నెల్ పథకం పంప్‌హౌజ్ రిటైనింగ్ వాల్‌ కూలడంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. శనివారం ప్రధాని నరేంధ్ర మోదీ పిలుపు మేరకు తన తల్లి పేరుతో మొక్క నాటారు.

  • Publish Date - August 10, 2024 / 01:09 PM IST

బీఆరెస్ విలీనంపై ఎలాంటి సంప్రదింపులు జరగలేదు

విధాత, హైదరాబాద్ : సుంకిశాల తాగునీటి టన్నెల్ పథకం పంప్‌హౌజ్ రిటైనింగ్ వాల్‌ కూలడంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. శనివారం ప్రధాని నరేంధ్ర మోదీ పిలుపు మేరకు తన తల్లి పేరుతో మొక్క నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి సుంకిశాల పథకం ఘటనకు అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆరెస్‌లు మీరంటే మీరంటూ పరస్పర విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో విలువైన ప్రజాధనంతో చేపట్టిన ఈ పథకంపై వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు ఉన్నత స్థాయి విచారణ జరిపించాలన్నారు. బీజేపీలో బీఆరెస్‌ విలీనం వార్తను పేపర్లలో చూశానని తెలిపారు. దీనిపై ఎటువంటి రాజకీయ చర్చలు, సంప్రదింపులు జరగలేదని స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష మార్పు పై పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. త్వరలో జరిగే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్ లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయన్నారు. పాక్ ఉగ్రవాదులు శాంతియుత పరిస్థితులు చెడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఎన్నికల సంఘం జమ్మూకాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ కు సిద్ధంగా ఉందన్నారు. దేశంలో పర్యావరణ మార్పుల వల్ల సమతుల్యం దెబ్బతిందన్నారు. దేశంలో అడవులు తగ్గిపోతున్నాయని, పట్టణ ప్రాంతాలు కాంక్రీట్ జంగల్ గా మారిపోతున్నాయన్నారు. అమ్మకు మించింది లేదని, నవమాసాలు మోసి అమ్మ జన్మనిస్తుందన్నారు. దేశాన్ని భారత మాతతో పిలుస్తామన్నారు. భూమిని భూమాత అని పిలుస్తామన్నారు. భూమాత సంరక్షణకు, మానవ మనుగడకు కీలకమైన పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు.