Site icon vidhaatha

అన్నారం బ్యారేజీ ఇసుక మేటల తొలగింపు పనులు షురూ

ఎన్‌డీఎస్‌ఏ సూచనలతో పనులు

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ ఎగువన ఉన్న ఇసుక మేటల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు పియర్స్ వద్ద సౌండింగ్, ప్రోబింగ్ పరీక్షలు చేయాల్సి ఉండగా వీటికి ఇసుక మేటలు అడ్డుగా ఉన్నందున వాటిని తొలగించే ప్రక్రియ పనులను అధికారులు ప్రారంభించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లల బ్యారేజీల నాణ్యత..వాటిలో ఏర్పడిన పగుళ్లు..లీకేజీలపై ఎన్‌డీఎస్‌ఏ బృందం పరిశీలన చేస్తుంది. వారి పరిశీలనకు వీలుగా బ్యారేజీలోని ఇసుక మేటలను తొలగిస్తున్నారు.

Exit mobile version