Vijayasai Reddy Farm | రైతుగా మారిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రైతుగా మారిపోయారు. వైసీపీ అధికారం కోల్పోయాక రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయసాయిరెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో మిరప పంటకు సేంద్రీయ మందుల పిచీకారి చేస్తూ సందడి చేశారు.

విధాత : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రైతుగా మారిపోయారు. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి, వచ్చాక పార్టీలో.. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి పార్టీ అధికారం కోల్పోయాక కొంత కాలం క్రితం రాజకీయాలకు గుడ్ బై కొట్టారు. అయితే తనపై నమోదైన కేసులకు సంబంధించి తరుచూ వార్తల్లో కనిపిస్తున్న విజయసాయిరెడ్డి తాజాగా శంకరాపురంలోని తన వ్యవసాయ క్షేత్రంలో రైతు అవతారంలో సందడి చేశారు. మిరప పంటకు సేంద్రీయ మందుల పిచీకారి చేస్తూ కనిపించారు.

సేంద్రియ వ్యవసాయంలో భాగంగా అగ్నాస్త్రం మిరపచెట్లకు స్ప్రే చేస్తున్నాము అంటూ ఆయన స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. అగ్నాస్త్రం తయారీకి గోవుమూత్రం, నూరిన వేపాకులు, వెల్లుల్లి, మిరపకాయలు, పొగాకు ప్లాస్టిక్ డ్రమ్ము లో వేసి బాగా కలియబెట్టి, మరగపెట్టి 24 గంటలపాటు నిల్వవుంచి వడపోసి ఆపై చెట్లకు స్ప్రే చేస్తాం అని వీడియోలో చెప్పుకొచ్చారు.

 

ఇవి కూడా చదవండి :

Moinabad farmhouse drugs case| డ్రగ్స్‌ కేసులో పైలట్‌ రోహిత్‌రెడ్డి సహా ముగ్గురికి రిమాండ్
Chinmayi | జ్ఞానపీఠ్ అవార్డు వివాదం.. వైరముత్తుకు అభినందనలు తెలిపిన రజనీ, కమల్‌పై చిన్మయి విమర్శలు

Latest News