Thai Army Destroy Hindu Deity : థాయిలాండ్ లో హనుమాన్ విగ్రహం కూల్చివేత..భారత్ లో వ్యతిరేకత
థాయిలాండ్-కంబోడియా సరిహద్దు వివాదంలో భాగంగా థాయ్ సైన్యం హనుమంతుడి విగ్రహాన్ని కూల్చివేయడం భారత్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇది హిందూ వారసత్వంపై దాడి అని నెటిజన్లు, ప్రముఖులు మండిపడుతున్నారు.
న్యూఢిల్లీ : థాయిలాండ్ లో ఆ దేశ సైన్యం హనుమంతుడి విగ్రహాన్ని కూల్చివేసిన ఘటన భారత్ లోని హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారిపోగా..అది చూసిన భారత్ హిందువులు థాయ్ సైన్యం చర్యపై మండిపడుతున్నారు. కంబోడియా నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో థాయ్ సైన్యం హనుమంతుడి విగ్రహాన్ని కూల్చివేసింది. దీనిపై
భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. థాయ్ భూభాగం”లో కంబోడియా దళాలు నిర్మించిన హిందూ దేవత విగ్రహాన్ని థాయ్ ఆర్మీ ఇంజనీర్లు కూల్చివేశారని ఆర్మీ మిలిటరీ ఫోర్స్ ఫేస్‌బుక్ పేజీ నివేదించింది. థాయ్ సైన్యం ఆ ప్రాంతాన్ని విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకుని భద్రతను పునరుద్ధరించిన వెంటనే ఈ ఆపరేషన్ జరిగింది. థాయ్ భూభాగంపై కంబోడియా వైపు ఉపయోగించిన చిహ్నాలను తొలగించే క్రమంలో థాయ్ సైన్యం హనుమాన్ విగ్రహాన్ని తొలగించింది.
ఇదే అంశంపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. సరిహద్దు వివాదం నెపంతో హిందూ దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఆమోదయోగ్యం కాదు. కంబోడియా ఏర్పాటు చేసినా చేయకపోయినా, విశ్వాసం, వారసత్వంపై దాడి చేయడం అసహనాన్ని మాత్రమే బహిర్గతం చేస్తుందన్నారు. థాయిలాండ్, కంబోడియా రెండూ బౌద్ధ దేశాలు, అయినప్పటికీ చరిత్రలో హిందూ దేవాలయాలపై పదేపదే దాడులు..విధ్వంసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్ర చిహ్నాలపై హింసను నినాదాలతో తెల్లగా చేయలేము అని.. ఏ మతమూ మరొకరి విశ్వాసాన్ని నాశనం చేయడం ద్వారా తన “శాంతిని” నిరూపించుకోదు అని విజయసాయి రెడ్డి కామెంట్స్ చేశారు. తన అభిప్రాయాన్ని ఆయన ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ లకు ట్యాగ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ కేసులో మంచు లక్ష్మీ, రీతూ, సన్నీల విచారణ
Large Sinkhole In UK : భూమి బద్దలైందా ! కాలువ కింద భారీ హోల్..తప్పిన ప్రాణనష్టం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram