India US Trade Deal| భారత్ తో అమెరికా ట్రేడ్ డీల్..స్టాక్ మార్కెట్ల పరుగులు
భారత్ - అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీరిస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో భారత స్టాక్ మార్కెట్లు పరుగు అందుకున్నాయి. భారత వస్తువులపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలను 50 శాతం నుండి 18 శాతానికి తగ్గించడానికి ట్రంప్ అంగీకరించారు. ట్రంప్ ప్రకటించినట్లుగా, ఈ సుంకాల తగ్గింపు వెంటనే అమలులోకి వస్తుంది.
న్యూఢిల్లీ: భారత్ – అమెరికా( India US Trade Deal) మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీరిస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్( Donald Trump) ప్రకటించడంతో భారత స్టాక్ మార్కెట్లు(Sensex jumps) పరుగు అందుకున్నాయి. భారత వస్తువులపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలను 50 శాతం నుండి 18 శాతానికి తగ్గించడానికి( 50 percent tariffs cut to 18 percent) ట్రంప్ అంగీకరించారు. ట్రంప్ ప్రకటించినట్లుగా, ఈ సుంకాల తగ్గింపు వెంటనే అమలులోకి వస్తుంది. ఈ నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ( Narendra Modi) అభ్యర్థన మేరకు తీసుకున్నట్లుగా సమాచారం. అమెరికాపై విధిస్తున్న సుంకాలను సున్నా స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపేయడానికి భారత్ అంగీకరించిందని ఈ సందర్బంగా ట్రంప్ తెలిపారు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై పడుతున్న 50 శాతం(ఇందులో రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన 25 శాతం అదనపు సుంకం ఉంది) సుంకాలు 18 శాతానికి తగ్గుతాయి. శ్వేతసౌధం కూడా ఈ అదనపు సుంకాల తొలగింపును ధ్రువీకరించింది.
ట్రంప్ ప్రకటన మేరకు భారతదేశం 500 బిలియన్ డాలర్లకు పైగా విలువైన అమెరికా ఉత్పత్తులు, వ్యవసాయం, సాంకేతికత, ఇంధనం వంటి వస్తువులను కొనుగోలు చేయనుంది. అమెరికా సుంకాల తగ్గింపు భారత మార్కెట్లకు ప్రోత్సాహం ఇవ్వనుంది. రెండు దేశాల వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయనుంది. అయితే భారత్ తో అమెరికా వాణిజ్య ఒప్పందం ప్రస్తుతానికి సుంకాలపై మాత్రమే పరిమితంగా ఉండవచ్చని, పూర్తి వాణిజ్య ఒప్పందం కాదని సూచిస్తున్నారు. అయితే భారత వస్తువులపై EUలోని 27 సభ్యదేశాల ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గింపుతో పాటు, వస్త్రాలు, ఔషధాలు, వైన్, కారు వంటి విభిన్న ఉత్పత్తుల వ్యాపారంలో కలిసివస్తుందని, ఈ మార్పులు భారత్-అమెరికా-యూరోపియన్ యూనియన్ వ్యాపారానికి పెద్ద లాభాన్ని తీసుకువస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
భారత్ – అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ చేసిన ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో దూసుకెలుతున్నాయి. సెన్సెక్స్ 2,256 పాయింట్ల లాభంతో 83,935 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 699 పాయింట్లు పుంజుకొని 25,787 వద్ద కొనసాగుతుంది. ప్రీ ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 3,600 పాయింట్ల వరకు పెరగ్గా.. నిఫ్టీ 26,300 మార్క్‌ను దాటడం గమనార్హం. అమెరికా టారిఫ్‌లు తగ్గించడంతో సూచీలు బలపడి పరుగు పెడుతున్నాయి.
మోదీ అభ్యర్ధన మేరకు సుంకాల తగ్గింపు: ట్రంప్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో రెందు దేశాల వాణిజ్య ఒప్పందంపై ప్రకటన చేశారు. మోదీపై గౌరవంతో ఆయన విజ్ఞప్తిమేరకు వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నానన్నారు. అమెరికా ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత ప్రధాని కట్టుబడి ఉన్నారు. 500 బిలియన్ డాలర్లకుపైగా విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లకు అదనంగా మరిన్ని దిగుమతులకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. భారత్ తో మాకున్న అద్భుతమైన బంధం మునుపెన్నడూ లేనంత బలంగా ముందుకు సాగనుంది అని, మోదీ, నేను అన్ని విషయాలను చక్కబెడుతున్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.
నాకున్న గొప్ప స్నేహితుల్లో భారత ప్రధాని మోదీ ఒకరని, ఆయనతో మాట్లాడటాన్ని గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భారత్‌కు ఆయన శక్తిమంతమైన, గౌరవప్రదమైన నాయకుడు. మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం అని చెప్పుకొచ్చారు. వాణిజ్యం, రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు, రష్యా చమురు కొనుగోలు నిలిపివేత, అమెరికా, వెనెజువెలా నుంచి భారత్ మరింత చమురు కొనుగోలు వంటి అంశాలపై చర్చించాం అని వెల్లడించారు. ఇది ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకగలదని అనుకుంటున్నానని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రంప్ ప్రకటన పట్ల మోదీ హర్షం
భారత్ తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను 50శాతం నుంచి 18 శాతంకు తగ్గిస్తున్నట్లుగా ట్రంప్ చేసిన ప్రకటన పట్ల ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్వాగతించారు. భారత ఉత్పత్తులపై ఇక నుంచీ 18 శాతం అమెరికా సుంకమే అమలు కానుందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇది ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున అధ్యక్షుడు ట్రంప్‌నకు చాలా చాలా ధన్యవాదాలు అని మోదీ తెలిపారు. ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పని చేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అని అభిప్రాయడ్డారు. ఎన్నో అవకాశాలకు దారులు తెరుచుకుంటాయని వ్యాఖ్యానించారు. ప్రపంచ శాంతికి, సుస్థిరతకు, అభివృద్దికి ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకం అని, శాంతి కోసం ఆయన చేసే ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుంది అని తెలిపారు. రెండు దేశాల భాగస్వామ్యాన్ని అత్యున్నత స్థాయికి చేర్చేందుకు ఆయనతో సన్నిహితంగా కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నా అని మోదీ ఎక్స్ లో పేర్కొన్నారు.
మోదీకి ఎన్డీఏ సన్మానం..ఇండియా కూటమి విమర్శలు
అమెరికా- భారత్ ల మధ్య వాణిజ్య ఒప్పందం.. సుంకాల తగ్గింపుపై ట్రంప్ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎన్డీఏ పక్షాలు ప్రధాని మోదీని సన్మానించాయి. ప్రధాని మోదీ కృషితోనే దేశానికి మేలు చేసే ఈ ట్రేడ్ డీల్ కుదిరిందని అభినందించారు. అయితే ఇండియా కూటమి పక్షాలు మాత్రం ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గిపోయాడని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్‌కు సంబంధించి వివరాలను తెలియజేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram