నీట్ పేపర్ లీకేజీతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్ధుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. తమిళనాడులో పర్యటించిన రాహుల్ గాంధీ నీట్ పేపర్ లీకేజీతో నిరాశ నిస్పృహాతో బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు.
బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీం అని, ప్రతి విద్యార్థి మనకు మరణం వెనుక ఓ కుటుంబం వేదన ఉందని వ్యాఖ్యానించారు. పేపర్ లీక్ తో విద్యార్థుల కష్టం రాత్రికి రాత్రి నాశనం అయ్యిందని, విద్యార్ధుల కష్టం, డబ్బు, భవిష్యత్తు వృధా అయిపోందని, వీటన్నింటికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రధాని మోదీ ఇప్పటివరకు కలవకపోవడం విచారకరం అన్నారు.
పిల్లలను కోల్పోయిన కుటుంబాలను ఆ దుఃఖం వారిని శాశ్వతంగా వెంటాడుతుందని, అదే సమయంలో అవినీతిమయమైన విద్యా వ్యవస్థపై ఎన్నో ప్రశ్నలు మిగిలిపోతాయని విమర్శించారు. ఇంత జరిగిన నిజాయితీ లేని విద్యా వ్యవస్థలో ఇంకా మన విద్యార్థులను నిజాయితీగా కష్టపడమని ప్రధాని అడుగుతున్నారని, విద్యార్థులను ‘క్షమించడం’ గురించి మాట్లాడుతున్నారని, భారత విద్యార్థులకు ప్రధానమంత్రి క్షమాపణ అవసరం లేదు అని, ప్రధాని మోదీనే వారికి క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Nothing is more painful than seeing a parent grieve their child.
Behind every young life lost is a family carrying pain that will never leave them – and serious questions about a broken education system.
Leaked papers. Cancelled exams. Years of preparation destroyed overnight.… pic.twitter.com/nzQE61zP14
— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2026