ఫోన్ ట్యాపింగ్‌పై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలంటూ రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలోని బృందం గవర్నర్ సీ.పీ.రాధాకృష్ణన్‌కు ఫిర్యాదు చేశారు.

  • Publish Date - April 8, 2024 / 01:55 PM IST

  • ఉన్నత స్థాయి విచారణ జరుపాలని వినతి
  • విధాత : రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలంటూ రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలోని బృందం గవర్నర్ సీ.పీ.రాధాకృష్ణన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలలో బీఆరెస్ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని లక్ష్మణ్ ఫిర్యాదులో పేర్కోన్నారు.

    ఫోన్ ట్యాపింగ్‌తో బీఆరెస్ నేతలు, అధికారులు దేశద్రోహానికి పాల్పడ్డారని, సూత్రధారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదనన్నారు. బీఆరెస్ నేతల అవినీతి, భూ కుంభకోణాలపై దర్యాప్తు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు.

    కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్న కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఈ కేసులో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ వదిలిపెట్టినా మేం వదలిపెట్టమని, దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని గవర్నర్‌ను తమ పార్టీ కోరుతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు కేసీఆర్ బాధ్యుడని, బీఆరెస్ పార్టీ గుర్తింపు రద్దుపై ఎన్నికల సంఘం ఆలోచన చేయాలని, ట్యాపింగ్‌కు బాధ్యులు ఎవరైనా తీవ్రమైన పర్యవసనాలు అనుభవించాలని స్పష్టం చేశారు.

    BJP

    Latest News