Site icon vidhaatha

BJP MP Aravind : కవితపై బీజేపీ ఎంపీ అర్వింద్ సెటైర్లు

BJP MP Aravind

విధాత : తెలంగాణ జాగృత అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కవిత స్పందిస్తూ కేసీఆర్ మంచివారని.. హరీష్ రావు, సంతోష్ రావులు వందల కోట్ల అక్రమార్జన చేశారని..వారి వల్లనే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటాయని చేసిన వ్యాఖ్యలపై అర్వింద్ ఘాటుగా స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్ కూతురు, కేటీఆర్ చెల్లెలు, హరీష్ రావు కు బంధువైన కవిత చేసిన వ్యాఖ్యలు చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయనడానికి బలమైన రుజువుగా భావించవచ్చని అన్నారు.

హరీష్ రావు, సంతోష్ రావుల కారణంగానే కేసీఆర్ సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని కవిత మాట్లాడారని.. సీబీఐ కాళేశ్వరం అక్రమాలపై విచారణ చేస్తే ముందుగా కవిత స్టేట్మెంట్ రికార్డు చేస్తే బాగుంటుందని సూచించారు. ఎలాగు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత నిందితురాలిగా ఉన్నందునా లిక్కర్ కేసు, కాళేశ్వరం కేసుల్లో కలిపి కవితను పిలిచి విచారిస్తే సరిపోతుందంటూ సెటైర్లు వేశారు.

Exit mobile version