ఆమనగల్లు నుంచి ప్రచారం ప్రారంభం
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: బీఆరెస్ పాలనలో మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీఠ వేశామని ఎమ్మెల్యే, ఆపార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రను సోమవారం ఆయన ఆమనగల్లు గ్రామంలోని రామలింగేశ్వర దేవాలయం నుంచి ప్రారంభించారు. ఆలయంలో పూజల అనంతరం ఆమనగల్లు నుండి రావులపెంట, లక్ష్మీదేవి గూడెం, మొల్కపట్నం వరకు ప్రజా ఆశీర్వాద యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు.
ఆమనగల్లులో సుమారు రూ.6 కోట్ల నిధులతో సంక్షేమ కార్యక్రమాలు చేశామని తెలిపారు. సీసీ రోడ్లు, మిషన్ భగీరథ నీళ్లు, మిషన్ కాకతీయతో చెరువుల మరమ్మతులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఆమనగల్లు అధ్యక్షులు కోల పాపయ్య, రావులపెంట సర్పంచ్ దొంతి రెడ్డి వెంకటరెడ్డి, ఎంపీటీసీ శ్రీరామ్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు పిండి సతీష్ రెడ్డి పాల్గొన్నారు.