విధాత : ఖమ్మం మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ బీఆరెస్ పార్టీకి రాజీనామా చేశారు. తుమ్మల ముఖ్య అనుచరుడిగా ఉన్న బాలసాని 2009లో టీడీపీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014 తుమ్మల వెంట బీఆరెస్‌లో చేరారు. గతంలో భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జీగా వ్యవహారించారు. 2015లో ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా గెలుపొందారు. కొంతకాలంగా బీఆరెస్ అధిష్టానం తనను పట్టించుకోకపోవడంతో బాలసాని అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో బీసీలను అణిచివేస్తున్నారంటూ రాజీనామా సందర్భంగా ఆరోపించారు. తాతామధుకు ప్రాథాన్యతనిచ్చి తనను పక్కన పెట్టారన్నారు. కాగా బాలసాని కూడా తుమ్మల బాటలోనే కాంగ్రెస్‌లో చచేరుతారని సమాచారం.