విధాత : మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో బీఆరెస్ అభ్యర్ధిగా పోటీ చేయనున్న నా అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి దే గెలుపని, కాంగ్రెసోళ్లకు మల్లన్న సినిమా చూపిస్తానని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
బుధవారం మల్కాజిగిరిలో నబీఆరెస్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డి ర్యాలీ, బహిరంగ సభలో మల్లారెడ్డి తనదైన శైలిలో మాట్లాడుతూ పార్టీకెళ్లి ఎవరు పోయినా ప్రజాదరణ మాత్రం ఎక్కడికి పోలేదన్నారు.
మళ్లీ మల్కాజిగిరిలో బీఆరెస్ పార్టీనే గెలుస్తుందన్నారు. మల్లన్న ఇక్కడి ప్రజలకు అండగా ఉంటాడన్నారు. రాముడసొంటి రాజశేఖర్ర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరముందన్నారు.