బీఎస్పీ గెలుపుతోనే బహుజనులకు రాజ్యాధికారం : మాయవతి

బహుజనుల రాజ్యాధికార సాధనకు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని, బీఎస్సీని గెలిపిస్తే రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ సీఎం అవుతారని మాయవతి పిలుపునిచ్చారు

  • Publish Date - November 22, 2023 / 02:55 PM IST

విధాత : బహుజనుల రాజ్యాధికార సాధనకు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని, బీఎస్సీని గెలిపిస్తే రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం అవుతారని బీఎస్పీ చీఫ్ కుమారి మాయవతి పిలుపునిచ్చారు. దేశంలో ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంలో బీఎస్సీ పాత్ర కీలకమన్నారు. ఓబీసీ రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ నివేదిక అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి, వీపీ సింగ్ ప్రభుత్వ హాయంలో ఓబీసీ రిజర్వేషన్లు సాధించిన ఘనత బీఎస్పీకే దక్కుతుందన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో తలపడుతూ దేశవ్యాప్తంగా బీఎస్పీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. ఎన్నికల్లో హామీలిచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు.