Site icon vidhaatha

పెరిగిన బుద్ధవనం ఎంట్రీ టికెట్ ధరలు

budda

నాగార్జునసాగర్ లోని బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం బుద్ధవనం ఎంట్రీ టికెట్లు ధరలను ఏప్రిల్ 1వ తేదీ నుండి పెంచారు.

విధాత : నాగార్జునసాగర్ లోని బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం బుద్ధవనం ఎంట్రీ టికెట్లు ధరలను ఏప్రిల్ 1వ తేదీ నుండి పెంచారు. బుద్ధవనం ప్రాజెక్ట్ నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు బుద్ధ వనం నిర్వహణ నిమిత్తం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి( అదనపు బాధ్యతలు) రమేష్ నాయుడు ఉత్తర్వుల మేరకు సోమవారం నుండి పెరిగిన టికెట్టు రేట్లను స్థానిక అధికారులు అమలు చేస్తున్నారు.

గతంలో బుద్ధ వనం సందర్శనకు గాను పెద్దలకు 50 రూపాయలు, పిల్లలకు 30 రూపాయలు ఉండగా పెరిగిన టికెట్ ధరల ప్రకారం పెద్దలకు 100 రూపాయలు, పిల్లలకు 50 రూపాయలు, విదేశీయులకు 300 రూపాయలు, బుద్ధ వనములోని సమావేశ మందిరమునకు రోజుకు 10,000 రూపాయలు, వీడియో కెమెరాకు రోజుకు 10,000 రూపాయలు, స్టిల్ కెమెరాకు 25 రూపాయలు, వీటితోపాటు స్కూలు ,కాలేజీ ఉపాధ్యాయ అధ్యాపక బృందాలకు అధికారిక వినతి పత్రాలు ఉంటే 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు. కాగా బౌద్ధ ఆధ్యాత్మిక నిర్మాణమైన బుద్ధవనాన్ని వ్యాపార అంశముగా వ్యవహరించడంపై, బుద్ధవనం ఎంట్రీ టికెట్ల రేట్లు ఒకేసారి రెట్టింపు చేయడంపై పలువురు విమర్శిస్తున్నారు.

Exit mobile version