వరంగల్‌లో సిటిజన్ పర్సెప్షన్ సర్వే.. ట్రాన్స్‌జెండర్ల భాగస్వామ్యం

సర్వేలో పాల్గొనాలని ర్యాలీ విధాత, వరంగల్: కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్న జీవన సౌలభ్య (సిటిజన్ పర్సెప్షన్) సర్వేలో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ప్రతినిధులు భాగస్వామ్యమయ్యారు. తాజాగా చేపట్టిన సర్వే నగర వ్యాప్తంగా కొనసాగుతున్నది. శానిటేషన్, మెప్మా సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా బుధవారం వరంగల్ బట్టల బజార్ ప్రాంతంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సిబ్బంది సర్వేపై అవగాహన […]

  • Publish Date - January 4, 2023 / 04:09 PM IST
  • సర్వేలో పాల్గొనాలని ర్యాలీ

విధాత, వరంగల్: కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్న జీవన సౌలభ్య (సిటిజన్ పర్సెప్షన్) సర్వేలో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ప్రతినిధులు భాగస్వామ్యమయ్యారు.

తాజాగా చేపట్టిన సర్వే నగర వ్యాప్తంగా కొనసాగుతున్నది. శానిటేషన్, మెప్మా సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా బుధవారం వరంగల్ బట్టల బజార్ ప్రాంతంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సిబ్బంది సర్వేపై అవగాహన క‌ల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు.

సర్వేలో ప్రజలు అధిక సంఖ్య‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నగరంలోని వివిధ బహిరంగ ప్రదేశాలు, దేవాలయాలు, పార్కుల్లో అవ‌గాహ‌న‌ సర్వేకు సంబంధించి ప్రచారం నిర్వహిస్తున్నారు. సర్వేలో పాల్గొనేలా బల్దియా సిబ్బంది ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.

ఈ సర్వేకు సంబంధించి డిజిటల్ ప్రదర్శన, వాల్ రైటింగ్స్, ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాలు, గోడప్రతులు నగరవాసులకు అందిస్తూ వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 7 న సర్వేలో పాల్గొనేందుకు చివరి గడువు ఉన్నందున ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ ఆన్‌లైన్‌లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు.

ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న నగరవాసులు eol2022.org/ లింక్ ద్వారా లాగిన్ అయ్యి స్థితి గతుల గురించి అందులో పేర్కొన్న సులభ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరారు.

కార్యక్రమంలో శానిటరీ సూపర్ వైజర్ సాంబయ్య, జవాన్లు జీవన్, రాధిక, రవితోపాటు ట్రాన్స్ జెండర్ రాష్ట్ర అధ్యక్షురాలు లైలాతోపాటు అశ్విని, నక్షత్ర, అమ్ములు, పూర్ణిమ, అనూష తదితరులు పాల్గొన్నారు.