విధాత: తెలంగాణ ఏర్పాటు కాగానే కుటుంబ సమేతంగా వెళ్లి ఫోటోలు దిగి సోనీయాగాంధీ కాళ్లకు దండం పెట్టి నమ్మించి వెన్నుపోటు పొడిచి మోసం చేసింది ఎవరో చరిత్ర పుటల్లో శాశ్వతంగా ఉందన్నారు. అయినా కేసీఆర్ కుటుంబాన్ని ఆమె ఏనాడు పల్లెత్తు మాట అనకుండా క్షమించారన్నారు. ఏపీలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుందన్నారు.
మా మంత్రివర్గ కూర్పు చూస్తేనే కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం ఎలా ఉంటుందో అర్థం అవుతుందన్నారు. ఉద్యమ సమయంలో చివరి వరకు పోరాడిన మందుల సామేలు బీఆర్ఎస్ పార్టీ అనాథగా వదిలేస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి తీసుకువచ్చిందన్నారు. దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చిన పార్టీ, తెలంగాణను నిజాం నిరకుంశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను గౌరవించి భారత దేశంలో విలీనం చేసి స్వేచ్చను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ప్రజలకు ఇచిచ్న ఆరు గ్యారంటీలను, ఎన్నికల హామీలను అన్నింటిని అమలు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీపడే విధంగా సంక్షేమం అభివృద్ధిలో ముందుకు తీసుకెలుతామన్నారు.