విధాత : కత్తి దాడి కేసులో గాయపడి సికింద్రాబాద్ యశోథ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాక ర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కాగా ప్రభాకర్‌రెడ్డికి వైద్యులు నాలుగు గంటలకుపైగా శ్రమించి ఆపరేషన్ చేశారు.
చిన్న ప్రేగుకు 4 చోట్ల గాయాలయ్యాయని, 15 సెంటిమీటర్లపై కడుపును కట్ చేసి, 10 సెంటిమీటర్లు చిన్న ప్రేగును తొలగించినట్లుగా యశోధ వైద్యులు తెలిపారు. గ్రీన్ ఛానెల్‌తో హైదరాబాద్‌కు తరిలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదని, రక్తం అంత కూడా కడుపులో పేరుకుపోయిందని, అందుకే 15 సెంటిమీటర్లు కట్ చేసి పేరుకుపోయిన రక్తం అంత క్లీన్ చేశామన్నారు. లోపల రక్తం పెరుకుపోవడం, ప్రేగుకు 4 చోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఇంత ఆలస్యం అయిందని తెలిపారు.