విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని..చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి జరుపుకుంటాం అని గుర్తు చేశారు.
శమీ పూజ చేయడం, అలాయ్ బలాయ్, పాలపిట్ట దర్శనం తెలంగాణకు ప్రత్యేకం అన్నారు. రాష్ట్రం అప్రతిహత విజయాలతో అభివృద్ధి సాధించాలి అని..ప్రజలందరూ సుఖ సంతోషాలతో దసరా పండగను జరుపుకోవాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.