Telangana Transport Checkposts Abolished : సాయంత్రం 5 గంట‌ల క‌ల్లా రవాణ చెక్ పోస్ట్ లు ఎత్తి వేయండి- ర‌వాణ శాఖ అధికారుల‌ను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలోని అన్ని రవాణా చెక్‌పోస్టులను తక్షణమే ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సాయంత్రం 5 గంటలలోగా నివేదిక ఇవ్వాలని, సిబ్బందిని ఇతర బాధ్యతలకు కేటాయించాలని రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Transport Checkposts Abolished

విధాత‌, హైదాబాద్‌: రాష్ట్రంలోని అన్ని రహదారులపై రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బుధ‌వారం సాయంత్రం 5 గంటలలోగా మూసివేతపై పూర్తి నివేదికను ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో తక్షణమే చెక్‌పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ ఆకస్మిక ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని వెంటనే వేరే బాధ్యతల్లో వినియోగించుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. రహదారులపై వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని, చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బ్యారికేడ్లు, తొలగించాలని డీటీవోలకు సూచించారు. చెక్క్‌పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నిచర్‌ను డీటీవో కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు. అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను సరిచూసి భద్రపరచాలని ఆదేశించారు.