హైదరాబాద్: టి.జి.టెట్-2024 పేపర్-1లో 67.13% మంది అర్హత సాధించారు. పేపర్-2లో 34.18% అర్హులయ్యారు. టి.జి.టెట్-2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-2 పరీక్షకు 1,50,491 హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. https://schooledu.telangana.gov.in వెబ్ సైట్లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% అర్హత పెరిగింది. 20023తో పోలిస్తే పేపర్-2లో 18.88% పెరిగింది. టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించింది. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
TGTET | టి.జి.టెట్-2024 ఫలితాలు విడుదల చేసిన … సీఎం రేవంత్ రెడ్డి
టి.జి.టెట్-2024 పేపర్-1లో 67.13% మంది అర్హత సాధించారు. పేపర్-2లో 34.18% అర్హులయ్యారు. టి.జి.టెట్-2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు.

Latest News
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !
వానల కోసం గాడిదలకు పెళ్లి!