Revanth Reddy | న్యూఢిల్లీ : సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 2019 అక్డోబర్‌లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నమోదైన ఈ కేసును కొట్టేయాలని గతంలో రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ కె.లక్ష్మణ్ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రేవంత్ రెడ్డిపై కేసు దాఖలు పిటీషనర్ కు సుప్రీంకోర్టు అక్షింతలు
సీఎం రేవంత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు దాఖలు చేయాలని పిటిషన్ దాఖలు చేసిన పెద్దిరాజుకు సుప్రీంకోర్టు అక్షితలు వేసింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమి భట్టాచార్యకు అఫిడవిట్ రూపంలో క్షమాపణలు చెప్పాలని సీజేఐ జస్టిస్ బీఆర్. గవాయ్ ధర్మాసనం పెద్దిరాజును ఆదేశించింది. రేవంత్ రెడ్డి పై పెద్దిరాజు దాఖలు చేసిన కేసును గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అయితే ఈ కేసును నాగ్ పూర్ బెంచ్ కి బదిలీ చేయాలని పెద్దిరాజు సుప్రీంకోర్టులో ట్రాన్స్ ఫర్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో హైకోర్టు న్యాయమూర్తిపై పిటీషనర్ పెద్దిరాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
పిటీషన్ డ్రాప్ట్ చేసిన ఏఓఆర్, పెద్దిరాజులపై సిజేఐ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమి భట్టాచార్యకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.
క్షమాపణ చెపుతూ దాఖలు చేసే అఫిడవిట్ పై నిర్ణయాన్ని జస్టిస్ మౌసమి భట్టాచార్యకే సుప్రీంకోర్టు వదిలేసింది. వా రం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పెద్దిరాజుకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ధర్మాసనం నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
AI వీగన్లు: కృత్రిమ మేధస్సుకు దూరంగా కొత్త జీవనశైలి
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశివారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు..!