Site icon vidhaatha

Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు నూత‌న వాహనం కొనుగోలు చేస్తారు..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చక్కని ప్రణాళికతో ముందుకెళ్తే వృత్తి వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాన్ని అందుకుంటారు. సన్నిహితులతో, స్నేహితులతో సరదాగా గడుపుతారు.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కృషి, పట్టుదలతో ఉద్యోగ వ్యాపారాలలో స్థిరత్వం సాధిస్తారు. చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు. ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గతంలోని ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త అందుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. డబ్బుకు లోటుండదు. వ్యాపారంలో తెలివిగా పెట్టుబడి పెడితే మంచి లాభాలుంటాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి. తెలివిగా ఖర్చు చేయండి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అనేక శుభవార్తలు అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడంతో ఆనందంగా ఉంటారు. ఆదాయ వనరులు పెరగడంతో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శుభఫలితాలు ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా గడుపుతారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యం సహకరిస్తుంది.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో క్లిష్టమైన పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ కోసం మీరు పనిచేయడం ఈ రోజు చాలా ముఖ్యం. ఉద్యోగులకు స్థానచలనం, పదోన్నతులు ఉండవచ్చు. వ్యాపారులు ఈ రోజు మంచి లాభాలు అందుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోండి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. జీవితభాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. కీలక సమావేశాలు, చర్చలలో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. ఆర్థిక లాభాలు మెండుగా ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. పనిపట్ల మీరు చూపే శ్రద్ధ మీకు ప్రశంసలు తెచ్చి పెడుతుంది. నలుగురిలో గుర్తింపు సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తారు.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. సంపూర్ణ మనోబలంతో అఖండ విజయాలు సాధిస్తారు. చేపట్టిన పనులన్నీ ఉత్సాహంతో పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుంచి అందిన శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. వృత్తిపరంగా చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.

Exit mobile version