Site icon vidhaatha

Revanth Reddy : రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 11క (విధాత): వికారాబాద్- కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ లో రైల్వే ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండాలన్నారు. ఇందుకు… భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్నారు.

రీజనల్ రింగ్ రైల్ ఆవశ్యకతను సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు వివరించారు. భవిష్యత్అవసరాలకు అనుగుణంగా కొత్త రైల్వేలైన్స్ ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు. శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం కొత్తగా రైల్వే కనెక్టివిటీ అంశాన్నీ పరిశీలించాలన్నారు.ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ తో పోలిస్తే కొత్త లైన్ తో దూరం కూడా తగ్గుతుందన్నారు.

ఈ సమావేశంలో ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, TR&B స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Exit mobile version