బీఆరెస్ లో చేరిన ప్రకాష్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ డీసీసీ అధ్యక్షులు, పాలమూరు మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాష్ బీఆర్ఎస్ లో చేరారు

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ డీసీసీ అధ్యక్షులు, పాలమూరు మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాష్ బీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బుధవారం జరిగిన సమావేశంలో అ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆయనకు గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.


ముత్యాల ప్రకాష్ గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా ఉన్న ప్రకాష్ బీ ఆర్ఎస్ లో చేరడం వెనుక మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మంత్రి సూచన మేరకే ప్రకాష్ కాంగ్రెస్ ను వీడి అధికార పార్టీలో చేరారు. ఇంత కాలం కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి, ఎన్నికల సమయంలో పార్టీని వీడడం మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు.