రాష్ట్రపతికి కాంగ్రెస్ లేఖ.. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు డిమాండ్‌

  • Publish Date - November 3, 2023 / 03:09 PM IST

విధాత : కాళేశ్వరం ప్రాజెక్టు పై సీబీఐ విచారణ కోరుతు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసింది. లేఖలో కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడాన్ని పరిశీలించారు. అటు బ్యారేజీ నిర్మాణ నాణ్యత లోపాలను సెంట్రల్ డ్యాం సెఫ్టీ ఆథార్టీ కమిటీ సైతం తప్పుబట్టింది. బ్యారేజీ దెబ్బతిన్న చోట పునర్ నిర్మాణం చేయాలని, అప్పటిదాకా నీటి నిల్వ చేయరాదని అభిప్రాయపడింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ లేఖ రాయడం సంచలనంగా మారింది.