కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటన

  • Publish Date - November 10, 2023 / 01:40 PM IST

– కామారెడ్డి వేదికగా బహిరంగ సభ

-హాజరైన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

ఏ. రిజర్వేషన్లు

1. కుల గణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు.

2. కొత్తస్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42%కి పెంపు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో

కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయప్రాతినిధ్యం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ.

3. పభ్రుత్వ సివిల్ కన్స్టక్ష్రన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్.

బీ. నిధులు

4. బీసీ సబ్ ప్లాన్ కు తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో

మహాత్మా జ్యో తిరావు ఫూలే బీసీసబ్ ప్లాన్ ఏర్పా టు.

5. బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ. 20,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయింపు.

సీ. సంక్షేమం

6. ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ.

7. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పా టు. బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు, ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీలేని రుణాలు.

8. అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీసర్కిల్, లైబర్రీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్

జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు, బీసీఐక్యత భవన్ లోనే జిల్లా బీసీసంక్షేమ కార్యాలయం ఏర్పాటు.

డీ. విద్య

9. ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో ఒక కొత్తడిగ్రీ

కళాశాల.

10. రూ.3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉనన బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం

ఫీజు రీయింబర్స్ మెంట్.

ఈ. చేతి వృత్తులకు సాయం

11. “వృత్తి బజార్” పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి, మంగలి, వడ్రంగి, చాకలి,

కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేత.

12. గీత కార్మికులు, చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న 50 ఏండ్ల వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సునే మిగతా

అన్ని చేతివృత్తులు చేపట్టే వారికి వర్తింపు.

13. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ, రూ.10 లక్షల ఆర్థిక

సహాయం.

ఎఫ్. వివిధ సామాజిక వర్గాలకు హామీలు

14. ముదిరాజ్

జీఓ ఎంఎస్ నం. డేట్ . 19/02/2009 పునరుద్ధరణ. ముదిరాజ్, ముత్రాసు, తెనుగోళ్ల సామాజిక వర్గాలను బీసీ-డీ నుండి బీసీ-ఏ లోకిచేర్చడం.

15. గంగపుత్ర

ఎ. మత్స్యకార హక్కు లకు సంబంధించి మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలను

పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పా టు. ఆక్వా కల్చర్ కు ప్రోత్సాహం, క్యాప్టివ్ సీడ్ నర్సరీలు,

మార్కెటింగ్ ఇన్ఫ్రాస్టక్ర్చర్ వంటి మత్స్య సంపద అభివృద్ధి కార్యక్రమాలు.

16. గొల్లకురుమలు

అధికారంలోకి వచ్చి న 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ.

17. గౌడ్

ఎ. ఈత చెట్లపెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయింపు. ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్

నిర్మా ణాలపై 90% సబ్సిడీ.

బి. మద్యం షాపుల లైసెన్సు లలో గౌడ్లకు ప్రస్తుతమున్న రిజర్వేషన్లు 15% నుంచి 25%కి పెంపు.

సి. జనగాం జిల్లాకు సర్దార్ సర్వా యిపాపన్న గౌడ్ జనగాం జిల్లాగా పేరు మార్పు .

18. మున్నూ రు కాపు

తెలంగాణ మున్నూ రు కాపు కార్పొరేషన్ ఏర్పాటు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాల

పంపిణీ.

19. పద్మశాలి

ఎ. జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ల ఏర్పాటు.

బి. పద్మశాలీలకు పవర్ లూమ్స్, పరికరాలపై 90% సబ్సిడీ.

20. విశ్వకర్మ

ఎ. మంగలి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరులకు 90% సబ్సిడీతో టూల్ కిట్లు.

బి. పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటుకు భూమి కేటాయింపు.

21.రజక

ఎ. రజక యువతకు పట్టణాల్లో లాండ్రోమెట్స్ ఏర్పా టు చేసుకునేందుకు రూ.10 లక్షలు.

బి. రాష్ట్రవ్యా ప్తంగా ధోబీ ఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు కేటాయింపు.

Latest News