వచ్చేది కాంగ్రెస్.. ఇచ్చేది ఆరు గ్యారంటీలు: పర్ణిక రెడ్డి

  • Publish Date - November 4, 2023 / 03:35 PM IST

– అందరించండి.. అభివృద్ధి చేస్తాం

– కాంగ్రెస్ గాలి వీస్తోంది.. ఇక ప్రజల తెలంగాణ వస్తుంది

– పేదల అభివృద్ధి కోసం పాటుపడుతా

– నారాయణ పేట అభివృద్ధిలో భాగస్వాములవుదాం

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని, పేదల కోసం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ పథకాల అమలు పక్కాగా జరుగుతాయని నారాయణ పేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పర్ణిక రెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రం నారాయణ పేటలో ఆమె ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నియోజకవర్గంలో రోజు రోజుకు కాంగ్రెస్ బలం పుంజుకున్నదని, ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పై నమ్మకం పెంచుకుని పార్టీలో చేరుతున్నారన్నారు. నారాయణ పేట నియోజకవర్గంలో అన్ని వనరులు ఉన్నా అధికారంలో ఉన్న నేతలు ఉన్న వనరులను ఉపయోగించుకోకుండా ఈ ప్రాంతాన్ని వెనకపడేసారని పర్ణిక అన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఇక్కడి రైతాంగం కోసం సాగునీరు ఇవ్వని ప్రభుత్వంపై ఇక్కడి రైతులు మండిపడుతున్నారన్నారు. బీఆర్ఎస్ పరిపాలనలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందని పర్ణిక అన్నారు. ఇలాంటి పార్టీని వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల కోసం నెల రు.2500 వారి బ్యాంక్ అకౌంట్ లో పడుతాయన్నారు. గ్యాస్ సిలిండర్ను రూ.500 కు అందిస్తామన్నారు. పేదల కోసం ఇంకా ఎన్నో పథకాలు కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తుందని పర్ణిక పేర్కొన్నారు. రైతుల బాగు కోసం రైతు బంధు ను పెంచుతామన్నారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు అందించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పర్ణిక అన్నారు.

కాంగ్రెస్ ను అందరిస్తున్న ప్రజలు

– కాంగ్రెస్ సీనియర్ నేత శివకుమార్ రెడ్డి

నారాయణ పేట నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అందరిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత కుంభం శివకుమార్ రెడ్డి అన్నారు. కోయిలకొండ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. దామరగిద్ద మండలంలోని అన్నసాగర్ గ్రామంలో శివకుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు పేదలకు వారం లాంటివని శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు. నారాయణ పేట నియోజకవర్గం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పర్ణిక రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే గ్రామాల్లో బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు.

Latest News