విధాత: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సీపీఐ సభ్యలు కూనంనేని సాంబశివరావు గురువారం శాసన సభలో సీపీ ఐ తరపున తీర్మానం ప్రవేశ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ల యాక్టివిటీని పునరుద్ధరించాలన్నారు. చనిపోయిన ఉద్యోగి కుటుంబంలో కన్సాలిడేటెడ్ విధానం కాకుండా, రెగ్యులర్ బేసిస్ లో నియామకం చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆ తీర్మానంలో కోరారు. 2013లో జరిగిన వేతన సవరణకు సంబంధించి బాండ్ల డబ్బులను విడుదల చేయాలన్నారు. మహిళా కండక్టర్లకు రాత్రి డ్యూటీ వ్యవధిని తగ్గించాలని కోరుతూ ఈ అంశాలపై అసెంబ్లీలో చర్చించడానికి కూనంనేని వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టారు. కాగా కూనంనేని ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.
CPI | ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయండి..అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టిన సీపీఐ
