విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల్లో మతతత్వ బీజేపీ, అవినీతికర బీఆర్ఎస్ లను ఓడించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి కోరారు. బుధవారం హనుమకొండ పార్టీ జిల్లా సమితి సమావేశం మండ సదాలక్ష్మి అధ్యక్షతన బాలసముద్రంలోని జిల్లా కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన చాడ మాట్లాడుతూ, దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ కారణంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రజాస్వామ్యం, లౌకిక వాదానికి ముప్పు వాటిల్లిందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు లౌకిక శక్తులను ఈ రాష్ట్రంలో గెలిపించి బీజేపీ, బీఆర్ఎస్ లను ఓడించేందుకు సీపీఐ కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. లౌకిక పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుటకు కృషి చేయాలని కోరారు.
దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టుతున్నారని మోడీపై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. ఆ రెండు పార్టీలకు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ వలీవుల్లా ఖాద్రి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, నాయకులు ఉట్కూరు రాములు, కర్రె లక్ష్మణ్, మునిగాల బిక్షపతి, నేదునూరి రాజమౌళి, పల్లేరు వీరస్వామి, మోతే లింగారెడ్డి, కామర వెంకటరమణ, బాషబోయిన సంతోష్, కొట్టే పాక రవి బట్టు మల్లయ్య, మాలోత్ శంకర్, కంటె నరసయ్య, రాసమల్ల దీన, మంచాల రమాదేవి పాల్గొన్నారు.