బీఅర్ఎస్ తోనే అభివృద్ధి.. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

బీఅర్ఎస్ తోనే అభివృద్ది సాధ్యమని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: బీఅర్ఎస్ తోనే అభివృద్ది సాధ్యమని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పార్టీ ఇంచార్జి తిరుపతి రెడ్డి , మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హవేలీ గణపురం మండలం ఫరీద్ పూర్, నిజాంపేట్ మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ యువకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.

ప్రస్తుత మ్యానిఫెస్టోలో మహిళలకు రూ.3000, రూ.400కే సిలిండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించడం మహిళలకు వరంగా అభివర్ణించారు. ముచ్చటగా మూడో సారి సీఎంగా కేసీఆర్ అవుతారని జోస్యం చెప్పారు. కార్యకర్త లే పార్టీకి బలమని, కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మామిళ్ళ ఆంజనేయులు, ఎంపీపీ సిద్దరాములు, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.