విధాత, ఇల్లెందు: ఇల్లందు నియోజకవర్గంలో గులాబీ రేకులు ఒక్కొక్కటిగా రాలుతున్నాయి. ప్రతిరోజూ ఆ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ఒక రోజు ముందు మంగళవారం నాడు బయ్యారం మండలానికి చెందిన పదుల సంఖ్యలో స్థానిక ప్రజా ప్రతినిధులు బీఆరెస్‌కు రాజీనామా చేసి, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
సిటింగ్ ఎమ్మెల్యేకు మరోసారి అవకాశం ఇవ్వడాన్ని స్థానిక బీఆరెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ నిర్ణయానికి నిరసనగా రాజీనామాలు చేస్తున్నారు. ఇల్లెందు బహిరంగసభలో బుధవారం సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సభకు జనసమీకరణ, ఏర్పాట్లలో నిమగ్నమైన పార్టీ నాయకులకు.. వరుస రాజీనామాలు కంగారు పుట్టిస్తున్నాయి.