విధాత, వరంగల్: టి ఎన్ జీ ఓస్ భవన్ నాంపల్లిలో హనుమకొండ జిల్లా టీ ఎన్ జీ ఓస్ యూనియన్ అద్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కార్యవర్గం కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముజీబ్ హుసైని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తారని అన్నారు.
ప్రభుత్వం దృష్టికి ఉద్యోగుల సమస్యలన్నీ తీసుకువెళ్ళామని, ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి సానుకూలంగా వుందని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముజీబ్ మాట్లాడుతూ జిల్లా టీ ఎన్ జీ ఓస్ యూనియన్ అధ్యక్షులు ఆకుల రాజేందర్ నేతృత్వంలో యూనియన్ బలోపేతానికి కృషి చేస్తున్నారని, ఉద్యోగులకు అందుబాటులో ఉంటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
జిల్లా అద్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముజీబ్ ల నేతృత్వంలో హనుమకొండ జిల్లా టీ ఎన్ జీ ఓస్ యూనియన్ బలోపేతానికి కృషి చేస్తున్నామని వారి నాయకత్వంలో ఎప్పటికప్పుడు ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గం కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముజీబ్ లను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షులు పుల్లూరు వేణు గోపాల్,కోశాధికారి పనికెల రాజేష్, గౌరవ అధ్యక్షులు శ్యామ్ సుందర్, కేంద్ర సంఘం నేతలు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్, రాము నాయక్, లక్మి ప్రసాద్, జిల్లా నేతలు సలీం, రాజమౌళి, సురేష్, రాజేష్ ఖన్నా, భరత్, రామాంజనేయులు, రామ్ ప్రసాద్, రాజీవ్, ప్రణయ్, పృథ్వి, శ్రీనివాస్, సుధాకర్, అలీ, వంశీ తదితరులు పాల్గొన్నారు.