ఎన్నం నామినేషన్ లో జనగర్జన

  • Publish Date - November 10, 2023 / 01:11 PM IST

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు పుర వీధులు ఉప్పొంగాయి… ఇసుక వేస్తే రాలనంత జన సమూహం.. రోడ్లన్నీ జన సంద్రం… ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లు… ఇదీ శుక్రవారం పాలమూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు. పట్టణంలోని మెట్టుగడ్డ ప్రాంతం నుంచి ప్రారంభమైన ర్యాలీ వీధుల వెంట పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీ నినాదాలతో ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ముందుకు కదిలారు. ఒక్కసారిగా పాలమూరు పట్టణంలో కాంగ్రెస్ నినాదం మార్మోగింది. ఎన్నం వెంట పార్టీ సీనియర్ నేతలు ఓబేదుల్లా కొత్త్వాల్, సంజీవ్ ముదిరాజ్, సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నామినేషన్ కు ముందు అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఎన్నం శ్రీనివాస్ రెడ్డి సతీసమేతంగా పూజలు నిర్వహించారు.