షామీర్పేట లోని ఈటల నివాసం లో సమావేశం తరువాత మీడియా తో మాట్లాడిన భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్.
విధాత:తెలంగాణలో అహంకారానికి ఆత్మాభిమానానికి మద్య యుద్దం జరుగుతుంది. ఇక్కడ అహంకారికి.. అతని అవినీతికి, కుటుంబపాలనకు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీలో , సమాజంలో కూడా గొంతు ఎత్తారు. ఆ గొంతును నొక్కి వేశారు. రాజ్యఅహంకారంతో అనగదొక్కుతున్నారు. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రగతి కోసం గత ఇరవై సంవత్సరాలుగా ఈటల రాజేందర్ కొట్లాడుతున్నారు. ప్రభుత్వం తన విధి మర్చిపోయింది. KCR, ఆయన కుటుంబం కోసం తెలంగాణ వచ్చినట్లుంది. తెలంగాణ రాష్ట్ర లక్ష్యం వెనక్కు పోయింది. ఈటల పోరాటం తెలంగాణ సమాజం కోసం పోరాటం. సమాజంలో అందరూ అనుకుంటున్నది.
భారతీయ జనతా పార్టీ KCR కి వ్యతిరేకంగా ఏదైతే మాట్లాడుతుందో అదే విషయాన్ని ఆయన పార్టీ లోపల ఉంది మాట్లాడారు. అందుకే బయటికి పంపించారు. తెలంగాణ వికాసం మేమందరం కోరుకుంటున్నాము. ఈటల శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. మాతో కలిసి వస్తున్నారు. మా అందరి లక్ష్యం ఒక్కటే తెలంగాణలో తానాషా పాలనను, అతని అహంకారాన్ని అంతమొందించడం. జన ఆందోళనను కొనసాగడానికి తెలంగాణ లో ఎంత మంది వస్తే వారందర్నీ కలుపుకు పోతాం. తెలగాణ వికాసమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. జననేత, ఉద్యమకారుడు ఈటలకి భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతుంది. తెలంగాణ కోసం పని చేసిన ఉద్యమకారుడు ఈ రోజు KCR ను వదిలి పెట్టి బయటికి వస్తున్నారు. KCR అహంకారం ఓడిపోతుంది కుటుంబయపాలన అంతం అవుతుంది.