విధాత, హైదరాబాద్ : మళ్లీ గ్రామాల్లో రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. వరిసాగు పనుల్లో నిమగ్నమైన రైతులకు యూరియా అవసరమవ్వడంతో రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. గ్రామాల్లో ఒకేసారిగా వరిసాగు పనులు జరుగుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో యూరియాకు డిమాండ్ పెరిగింది. జనగామ జిల్లా పాలకుర్తిలో వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద రైతులు ఉదయం నుంచి యూరియా కోసం బారులు తీరారు. కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికే టోకెన్లు ఇస్తున్నారని కొందరు రైతులు ఆరోపించారు. సహకార సంఘంలో యూరియా నిల్వలు ఉన్న అధికారులు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. యూరియా బస్తాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నవీడియో వైరల్‌గా మారింది.