మెగా, అల్లు, ఘట్టమనేని, జూనియర్, మంచు కుటుంబాలు
రకుల్‌ప్రీత్ సింగ్ రాక
విధాత హైదరాబాద్: హైదరాబాద్‌లో ఓటు ఉన్నసినిమా హీరోలు, హీరోయిన్లు..సెలబ్రిటీ తారలంతా లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగారానికి చేరుకుంటున్నారు. మరికొందరు హైదరాబాద్‌లో స్థిరపడిన నటులు, ప్రముఖులు తమ ఓటున్న గ్రామాలకు బయలుదేరారు. వేర్వేరు ప్రాంతాల్లో షూటింగ్ పనుల్లో, ఏపీ ఎన్నికల ప్రచారాల్లో నిన్నటిదాకా బిజీగా ఉన్న నటీనటులంతా హైదరాబాద్ బాట పట్టారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఎన్‌టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు ఫ్యామిలీ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
జూబ్లీహిల్స్ క్లబ్‌లో చిరంజీవి, రాంచరణ్ ఫ్యామిలీ, ఓబుల్ రెడ్డి స్కూల్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతిలు, బీఎస్ఎన్ఎల్ సెంటర్ జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో మహేశ్ బాబు, నమ్రత, మంచు మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్, విజయ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్, జీవిత, రాజశేఖర్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
అటు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా హైదరాబాద్‌లో తన ఓటు ఉండటంతో ఆమె ఓటేసేందుకు నగరానికి చేరుకున్నారు. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న రకుల్‌ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో సినీమాలేవి చేయనప్పటికి ఆమెకు హైదరాబాద్‌లో ఎఫ్45జిమ్‌తో పాటు పలు వ్యాపారాలున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ గతంలోనూ హైదరాబాద్‌లోనే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.