గోల్కోండ కోటను సందర్శించిన విదేశీ మీడియా, అషాడ మాసం బోనాల ఉత్సవాలను వివరించిన … మంత్రి కొండా సురేఖ

గోల్కోండ కోటను సందర్శించిన విదేశీ మీడియా ప్రతినిధులకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కోట విశేషాలతో పాటు అషాడ మాసం బోనాల పండుగ విశేషాలను వివరించారు

  • Publish Date - June 26, 2024 / 06:19 PM IST

విధాత, హైదరాబాద్‌ : గోల్కోండ కోటను సందర్శించిన విదేశీ మీడియా ప్రతినిధులకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కోట విశేషాలతో పాటు అషాడ మాసం బోనాల పండుగ విశేషాలను వివరించారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాల పండుగ నగరంలో అషాడమాసంలో జూలై 7వ తేదీన గోల్కోండ ఎల్లమ్మ బోనాలతో ప్రారంభమవుతాయని తెలిపారు. తర్వాతా వరుసగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు, ఆదివారాలు నెల రోజుల పాటు హైదరాబాద్ నగరమంతట బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారని వారికి మంత్రి వివరించారు. జూలై 7వ తేదీ ఆదివారం ప్రారంభమయ్యే బోనాలు…ఆగస్టు 4వ తేదీ ఆదివారంతో ముగుస్తాయని, నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే అషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా జూలై 9వ తేదీన నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు 20 కోట్లు కేటాయించినట్లు మంత్రి సురేఖ వెల్లడించారు.

Latest News